అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సీఎం కేసీఆర్ పోతిరెడ్డిపాడు, రాయలసీమ లిఫ్ట్ అంశంపై పరిష్కారం తీసుకొస్తారని ఆశించాం
దేవుడితోనైనా కొట్లాడతా అంటూ ఆయన చేసిన కామెంట్లను చూసి ఏదో చేస్తారని అనుకున్నాం
మళ్ళీ అలంపూర్ దగ్గర ఏదో కొత్త ప్రాజెక్ట్ కడతా అని ప్రకటించారు
పాలమూరు-రంగారెడ్డి ఇప్పటి వరకు పూర్తి చేయలేదు
పాలమూరు-రంగారెడ్డి పూర్తి చేయకుండా కొత్త ప్రాజెక్ట్ అంటే ప్రజలను మోసం చేయడమే
ఏపీ ప్రభుత్వం ప్రాజెక్ట్ వేగవంతం చేసి 8 టీఎంసీ అదనపు నీటిని తీసుకెళ్తోంది
ఇదంతా చూస్తుంటే ఏపీ సీఎంతో కుమ్మక్కవలేదని ఎలా అనుకోవాలి?
పాలమూరు-రంగారెడ్డిలో రహస్యం ఏదీ లేదంటారు. మరి డీపీఆర్ లు ఎందుకు బహిర్గతం చేయడం లేదు?
అంచనా వ్యయం అడ్డగోలుగా పెంచి దోచుకుంటున్నారు
అప్పులు తీసుకొచ్చి మరీ ప్రాజెక్టుల పేరుతో దోచుకుంటున్నారు
డీపీఆర్ బయటపెడితే ఇవన్నీ బయటపడతాయని భయపడుతున్నారు
పాలమూరు-రంగారెడ్డి బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులకు లోబడి అంటున్నప్పుడు కొత్త ప్రాజెక్ట్ కు ఎక్కడి నుంచి నీటిని తీసుకొస్తారు?
డిండి, పాలమూరు అనేవి అదనపు జలాల నుంచి వాడుకునే ప్రాజెక్టులు అనే విషయం అందరికీ తెలుసు
కొత్త ప్రాజెక్ట్ పేరుతో మహబూబ్ నగర్ జిల్లా ప్రజలను మోసం చేస్తున్నారు
జూరాల నుంచి మార్చడం వల్ల ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు
గుర్రంగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టడం వల్ల హైడల్ ప్రాజెక్ట్ మునిగిపోతుందని ఇంజినీర్లు చెబుతున్నారు
అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన తర్వాత కేసియార్ ఒక్కమాట మాట్లాడలేదు
ఇప్పుడు దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు. పైగా కొత్త ప్రాజెక్ట్ పేరుతో దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు
కోర్టుకు వెళ్లకుండా ఉంటే ట్రిబ్యునల్ ఏర్పడేది. పైగా ట్రిబ్యునల్ వేయలేదని కేంద్రాన్ని నిందిస్తున్నారు.
ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి కేసీఆర్ కు లేనేలేదు
వైఎస్ జగన్ మాట్లాడింది నిజమే. తెలంగాణకు 299 టీఎంసీల కేటాయింపునకు కేసీఆర్ ఒప్పుకుని వచ్చారు.
నిజానికి 500కు పైగా టీఎంసీ వాటా రావాల్సి ఉండగా, 299 కే ఒప్పుకుని తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారు
No comments:
Post a Comment